Telangana RTC JAC : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ జేఏసీ సహా పలు కార్మిక సంఘాలు రవాణా సంస్థ యాజమాన్యానికి సమ్మె నోటీసులను ఇచ్చాయి. హైదరాబాద్‌లోని బస్ భవన్లో అధికారులకు కార్మిక సంఘం నేతలు సమ్మె నోటీసులను అందించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నోటీసులో స్పష్టంగా పేర్కొన్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2 పీఆర్సీలు అమలు చేయాలనే అంశం వారి ప్రధాన డిమాండ్‌గా ఉంది. అలాగే సీసీఎస్, పీఎఫ్ డబ్బులు రూ.2,700 కోట్లు వెంటనే చెల్లించాలని కూడా కోరుతున్నారు. వీటిని నెరవేర్చకుంటే సమ్మెకు దిగుతామని కార్మిక సంఘాలు నోటీసుల్లో పేర్కొన్నాయి. ఆర్టీసీ జేఏసీ, కార్మిక సంఘాలు మాత్రం సమ్మె తేదిని ఇంకా ప్రకటించలేదు.