Rapido Story: ర్యాపిడో గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ర్యాపిడో సమాజంలో విస్తృతమైన ఆదరణను చూరగొంది. అతి చిన్న అంకుర సంస్థగా ముగ్గురు వ్యక్తులతో మొదలైన ర్యాపిడో నేడు దాదాపు చాలా నగరాల్లో తన సేవలను అందిస్తుందంటే అది ప్రజలకు ఎంతలా చేరువైందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం మహా నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు అంతటా దీని జైత్రయాత్ర కొనసాగుతోంది. ఉపాధి కొసం చూసే ఎంతో మంది నిరుద్యోగులకు ఇది బాసటగా నిలుస్తోంది. అయితే ఇటీవల ర్యాపిడో మరో ఘనతను అందుకుంది. ఆన్లైన్ ట్రాన్స్పోర్ట్ స్టార్టప్‌గా మొదలై తాజాగా యూనికాన్ సంస్థగా అవతరించింది. దీని ద్వారా మరిన్ని సేవలను వినియోగదారులకు అందించే అవకాశం ఉంటుంది.