CM Revanth Reddy Speech in Station Ghanpur : గ్రూప్-1, 2, 3 పరీక్షలను సవ్యంగా నిర్వహించి ఉద్యోగాలు ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించే కృషి చేస్తున్నామని అన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ దివాళా తీయించారని విమర్శించారు. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నామని, తెలంగాణ రాష్ట్రానికి కడియం అవసరం ఉందని చెప్పి పార్టీలోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం త్వరలోనే పూర్తి కానుందని తెలిపారు.