రైతు బంధు, పంట భరోసాపై శాసనసభలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంత్రి తుమ్మల మధ్య వాడీవేడిగా చర్చ సాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలపై ఒక్క మంత్రి కూడా ఇప్పటివరకు స్పందించలేదని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. వ్యవసాయేతర భూములకు గత ప్రభుత్వం 25 వేల కోట్ల రైతుబంధు సాయం ఇచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆరోపించారు. ప్రస్తుతం రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ చేపడతామన్నారు. గత ప్రభుత్వంలో ఆగిపోయిన పథకాలన్నింటినీ మళ్ళీ ప్రారంభిస్తామని ప్రకటించారు. రైతుబంధు సమితి అధ్యక్షుడుగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు వచ్చినప్పుడు సూటబుల్ కాదని ఆరోపే చెప్పానని గుర్తు చేశారు