Begumpet Railway Station Redevelopment : అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్‌తో కలిసి బేగంపేట రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రైల్వేలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని కిషన్‌రెడ్డి అన్నారు. త్వరలోనే బేగంపేట రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. మరో 10 శాతం పనులు పూర్తి కావాల్సి ఉందని, విమానాశ్రయాల తరహాలో రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.