Heavy Traffic Jam In Kaleshwaram : మూడో రోజూ సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్న నేపథ్యంలో కాళేశ్వరానికి భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగింది. వారాంతం కావడంతో వాహనాల్లో భక్తులు కాళేశ్వరం చేరుకుంటున్నారు. దీంతో మహదేవపూర్, కాళేశ్వరం రహదారిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్ జామ్‌ను క్రమబద్దీకరించేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలు ద్విచక్రవాహనంపై తిరుగుతూ వాహనాలను పంపించే పనిలో నిమగ్నం అయ్యారు. శనివారం వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో వాహనాలు కాళేశ్వరం చేరుకుంటున్నాయి.