Khammam Loss Report : భారీ వర్షాలు, వరదలు ఖమ్మం జిల్లాను కోలుకోలేని దెబ్బతీశాయి. మున్నేరు విలయం పరివాహక ప్రాంతాలకు అపార నష్టం మిగిల్చింది. ముంపు ముప్పుతో మున్నేరు ప్రభావిత ప్రాంతాలు కకావికలం కాగా ప్రజా, ప్రభుత్వ ఆస్తులకు ఊహించని నష్టం వాటిల్లింది. వరద మిగిల్చిన విషాదంతో నిలువ నీడలేక, కట్టుకునేందుకు దుస్తులు లేక బాధిత కుటుంబాలు బోరుమంటున్నాయి. జిల్లాలో రూ.417 కోట్ల 69 లక్షల మేర నష్టం జరిగినట్లు జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా నివేదికలు ప్రభుత్వానికి పంపింది.