Skip to playerSkip to main contentSkip to footer
  • 11/20/2024
CM Revanth Reddy Public Meeting : మాజీ సీఎం కేసీఆర్​ అసెంబ్లీకి రావాలని.. 80 వేల పుస్తకాల్లో ఏం చదివారో చెప్పాలని సీఎం రేవంత్​ రెడ్డి సవాల్​ విసిరారు. ప్రజలనే కాదు.. వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్​ మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్​ను గద్దె దించాలని సిరిసిల్ల పాదయాత్రలో నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇవాళ వేములవాడలో నిర్వహించిన ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్​పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

త్వరలోనే మిడ్​ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్​ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో వాయిదా పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి మంత్రి ఉత్తమ్​ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈనెల 30న మరోసారి ఉత్తమ్​కుమార్​రెడ్డి ఇక్కడికి వచ్చి ప్రాజెక్టులపై సమీక్షిస్తారని వెల్లడించారు.

Category

🗞
News

Recommended