Minister Nadendla Manohar About PDS Rice : చౌక బియ్యం నిల్వ ఉంచే బఫర్ గోదాముల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన కెమెరాలు బిగించబోతున్నామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పీడీఎస్ బియ్యంపై శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కొండబాబు, కూన రవికుమార్, వెనిగండ్ల రాము తదితర సభ్యులు అడిగిన ప్రశ్నలకు నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా నిరోధించేలా కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని ఎన్ఓసీ ఇచ్చిన తర్వాతే సదరు లారీలు నౌకలో లోడ్ చేసేలా కార్యాచరణ చేపట్టామన్నారు. వీటితో పాటు సముద్రంలోకి వెళ్లే బార్జ్లను కూడా తనిఖీలు చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.