Minister Savitha Allegations on YSRCP Leaders : గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతల అరాచకాలు అన్నీ ఇన్నీ కావని మంత్రి సవిత ఆరోపించారు. అధికారులను తుపాకీ పెట్టి బెదిరించి పనులు చేసుకున్నారని అన్నారు. కడప డీఆర్సీ సమావేశంలో పాల్గొన్న మంత్రి సవిత, సీఎం నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న మంచి పాలనకు అధికారులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి రావడానికి ఎన్డీఏ కూటమి నేతలు ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా పాలన సాగించడానికి సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారనీ మంత్రి గుర్తు చేశారు.