Joint Collector Notice To YSRCP MLA Akepati Amarnath Reddy : ప్రభుత్వ భూములు ఆక్రమించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజంపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి విచారణకు హాజరు కాకపోవడంపై జేసీ అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తరపున న్యాయవాది హాజరు కాగా ఎన్నిసార్లు ఇదే విధంగా తప్పించుకుంటారని వ్యాఖ్యానించారు. రాజంపేట కోర్టుకు వెళ్తామని న్యాయవాది చెప్పడంతో అదనపు మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న జేసీ ఆదర్శ రాజేంద్రన్ మరింత అసహనానికి లోనయ్యారు. జేసీ కోర్టుకు రమ్మని నోటీసిస్తే రాజంపేట కోర్టుకు వెళ్తామని సమాధానం చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ఎవరు నోటీసులు ఇచ్చినా ఎలాంటి విచారణకు వెళ్లేది లేదని ఎమ్మెల్యే ఆకేపాటి స్పష్టం చేయడం వివాదాస్పదంగా మారింది.