Varra Ravindra Reddy Admits To Truth Matter Of indecent Posts : రాష్ట్రంలో కీలక నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డి ఎట్టకేలకు వాస్తవాలు ఒప్పుకొన్నారు. సజ్జల భార్గవ్‌రెడ్డితో పాటు ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి సూచనల మేరకు తాను పోస్టులు పెట్టానని, తన పేరుతో ఉన్న ఫేస్‌బుక్ ఖాతాలనూ వారే నిర్వహించారని చెప్పినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ దాటవేత ధోరణిలో వ్యవహరించిన వర్రా పోలీసులు సాంకేతిక ఆధారాలు చూపించిన తర్వాత నేరాలను అంగీకరించడంతో పాటు సూత్రధారుల పేర్లను బయటపెట్టినట్లు సమాచారం. వర్రా కస్టడీ నివేదికను నేడు పోలీసులు కడప కోర్టుకు సమర్పించే అవకాశముంది.