Rajagopal Reddy Comments On Ministerial Post : మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, కానీ నా మంత్రి పదవి విషయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. మహాభారతంలో ధర్మరాజులాగా వ్యవహరించాల్సిన జానారెడ్డి వంటి వారు ప్రస్తుతం ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా మంత్రి పదవి విషయంలో జానా రెడ్డి అడ్డుతగలడం చూసి చాలా బాధగా ఉందన్నారు.