Minister Ponnam Reacts On jagadish Reddy Comments : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీసీ సంక్షేమ, రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. మూసీ నిర్వాసితులకు పునరావాసం కల్పించిన తర్వాతనే ఖాళీ చేయిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. గాంధీభవన్లో అయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బాధితులకు రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వడంతో పాటు వారి పిల్లలకు విద్య తదితర వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పన్నెండున్నర గంటలకు ఏ ప్రభుత్వ శాఖ అనేది దానిపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. బీసీ సంక్షేమశాఖ, బీసీ కమిషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వ శాఖ ద్వారా కులగణన కొనసాగుతుందని పొన్నం వివరించారు.