Minister Ponguleti Comments On BRS : పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అనేక కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళిలోపే టపాసులా పేలుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వారిని అరెస్టు చేయాలా జీవితకాలం జైలులో పెట్టాలా అనేది చట్టం చూసుకుంటుందని మంత్రి తెలిపారు. ఆస్తుల రికవరీ కూడా చట్టమే చూసుకుంటుందన్న పొంగులేటి అది ప్రభుత్వ నిర్ణయం కాదని స్పష్టం చేశారు. తాతలు, తండ్రుల ఆస్తుల్లాగా చట్టాలను అతిక్రమించి వారు ఫలితాలు అనుభవిస్తారని హెచ్చరించారు.నాలుగో రోజు దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న రాష్ట్రప్రతినిధుల బృందం మూసీ సుందరీకరణ, తదితర అంశాలపై విస్తృతంగా అధ్యయన చేస్తుంది.