BRS leaders Meet DGP : కాంగ్రెస్ నేతల ఆదేశాలను పోలీసులు పాటిస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌పై దాడి చేసినా చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడే తీరు మార్చుకోవాలంటూ హితవు పలికారు. గురువారం బీఆర్ఎస్ నేతలపై దాడులు, శాంతిభద్రతలపై డీజీపీకి ఆ పార్టీ నేతల బృందం ఫిర్యాదు చేసింది.