AP DGP on Cyber Crimes : రాష్ట్రంలో సైబర్ క్రైమ్ పెరిగిందని డీజీపీ ద్వారకా తిరమలరావు అన్నారు. ఇతర నేరాలు తగ్గి ఇవి పెరిగాయని చెప్పారు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతోన్న అంశమని తెలిపారు. దీనిని ఎలా అదుపుచేయాలనేది ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలనేది ఆలోచనని వివరించారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.