Cyber Fraud: ప్రకాశం జిల్లా కనిగిరిలో సైబర్ మోసానికి ఓ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి భారీ మొత్తంలో మోసపోయాడు. పోలీసులమని, లాయర్లమని చెబుతూ 36 లక్షల వరకు సైబర్ నేరగాళ్లు దోచేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కనిగిరి పట్టణంలోని కనకపట్నంలో నివాసముంటున్న మూలే బ్రహ్మరెడ్డి అనే రిటైర్డ్ ఎంఈఓ గత నెల 17వ తేదీన సైబర్ నేరగాళ్ల వలలో పడ్డాడు.