Sri Sri Ravi Shankar On Canada Temple Attack : కెనడాలోని హిందూ దేవాలయంపై జరిగిన దాడిని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ తీవ్రంగా ఖండించారు. భిన్న సంస్కృతులకు నెలవైనటువంటి కెనడా లాంటి దేశంలో ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరమన్నారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. హిందూ దేవాలయంపై దాడులకు పాల్పడిన వారు కోట్లాది మంది హిందువుల మనోభావాలతో పాటు సిక్కు మతాన్ని, సిక్కు గురువులను కూడా అవమానిస్తున్నారని ఆయన తెలిపారు.