Cyber Crimes Through Mule Bank Accounts: కమీషన్ పేరుతో పేద ప్రజలకు ఎర వేస్తారు. బోగస్ కంపెనీ పేర్లతో కరెంట్ బ్యాంక్ ఖాతాలు తెరుస్తారు. సైబర్ నేరాల్లో దోచిన సొత్తును ఆ ఖాతాకు బదిలీ చేస్తున్నారు. గంటలో 200 బ్యాంక్ ఖాతాలకు చిన్న మొత్తాల్లో మళ్లించి, వేరే దేశాల్లో నగదు విత్ డ్రా చేస్తున్నారు. ఇలా సైబర్ దోపిడీలో మ్యూల్ అకౌంట్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో డబ్బు కోసం ఖాతాలను తెరిచిన వారే చిక్కడంతో కేసులు ముందుకు కదలడం లేదు. వందల కోట్ల రూపాయలు తరలిస్తున్న మ్యూల్ ఖాతాలు పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి.