YSRCP Govt SECI Deal : సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-సెకి నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలనే ఏకైక లక్ష్యంతో నాటి వైఎస్సార్సీపీ పెద్దలిచ్చిన ఆదేశాల ప్రకారం ఏపీ పవర్ కోఆర్డినేషన్ కమిటీ-(ఏపీపీసీసీ) అడ్డగోలు లెక్కలు తయారు చేసింది. అసలు సెకి నుంచి వచ్చే కరెంట్ రాష్ట్రానికి అవసరమా? లేదా? అనే విషయాన్ని పక్కనపెట్టి, సెకి విద్యుత్‌ను ఎట్టిపరిస్థితుల్లో కొనాలనే లక్ష్యానికి వీలుగా డిమాండ్, సప్లై నివేదిక రూపొందించింది.