AP Sadhu Parishad Srinivasananda Saraswati: మతాల మధ్య వైషమ్యాలు పెంచేందుకే జగన్ తిరుమల పర్యటనకు వస్తున్నారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. ఆలయ సంప్రదాయాలను గౌరవించకుండా జగన్ ఐదేళ్లుగా ఎంతో అపచారం చేశారని మండిపడ్డారు. డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్కు ఉన్న అభ్యంతరం ఏంటని నిలదీశారు. తిరుమల వైభవానికి జగన్ పర్యటనతో కలంకం వస్తుందని మండిపడ్డారు. శాంతియాగం, సంప్రోక్షణతో పవిత్రమైన తిరుమల, మళ్లీ జగన్ పర్యటనతో అపవిత్రమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొండపైకి వచ్చి కోట్ల మందిని క్షోభకు గురిచేయవద్దని హితవు పలికారు.