BRS MLA Harish Rao on Leadership : కేసీఆర్ తర్వాత కేటీఆర్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించినా స్వాగతిస్తానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీశ్‌రావు స్పష్టంచేశారు. గతంలో కూడా ఈ అంశంపై చాలాసార్లు స్పష్టత ఇచ్చినట్లు ఆయన గుర్తుచేశారు. హరీశ్‌రావు బీఆర్‌ఎస్‌లో అసంతృప్తితో ఉన్నారని కొత్తపార్టీ పెడుతున్నారని జరుగుతున్న ప్రచారంపై పాత్రికేయులు ప్రస్తావించగా వాటిని ఆయన ఖండించారు. కార్యకర్తగా కేసీఆర్, పార్టీ ఆదేశాలను పూర్తిగా పాటిస్తానని తేల్చిచెప్పారు. తనపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని అప్పుడే ఖండించానని, బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారని గుర్తు చేశారు.