YSRCP Leader Scams: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత అంతటి హవా ఆయనదే. తనదైన రీతిలో పెత్తనం చెలాయించి వేల కోట్లు వెనకేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష నేతలపై దాడులకు తెగబడ్డారు. మంత్రి హోదాలో ఉండి, గనులు గుంజుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములపై కన్నేసి వందల ఎకరాలు కబ్జా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా ఆ ‘పెద్దాయన’ దాహం తీరనిదన్న వాదనకు బలం చేకూర్చుతూ పేదలను, ప్రతిపక్షాల్నీ వేధించారు. ఆ నేత ప్రోత్సాహంతో వైఎస్సార్సీపీ నేతలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చెలరేగిపోయారు. వారి చేసిన అవినీతికి, అక్రమాలకు అంతేలేదంటే అతిశయోక్తి కాదు.