Avanthi Srinivas Quit YSRCP : ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్సార్సీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు నచ్చక కొందరు రాజీనామాల బాట పట్టారు. మరికొందరు వేరే పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే కీలక నాయకులంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడారు. పలువురు మేయర్లు, కౌన్సిలర్లు గుడ్ బై చెప్పేశారు. తాజాగా ఇవాళ వైఎస్సార్సీపీకి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్), భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రాజీనామా చేశారు.