YSRCP LEADERS RESIGN: జగన్‌పై ఆపార్టీ నేతలు పెట్టుకున్న భ్రమలు క్రమంగా తొలగిపోతున్నాయి. ఆయన తీరేంటో తెలిసొస్తోంది. ఇంకా వైఎస్సార్సీపీలో ఉంటే జనంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయనే భయంతో నేతలు ఆ పార్టీకి దూరం జరుగుతున్నారు. గ్రామ స్థాయి నాయకులు మొదలు కీలక నేతల వరకు రాజీనామాల లేఖాస్త్రాలు సంధిస్తూ తాడేపల్లి ప్యాలెస్‌తో తమకున్న బంధాన్ని తెంచుకుంటున్నారు. ఎన్నికల ముందే కీలక నేతలు జగన్‌కు గుడ్ బై చెప్పగా, ఆపైనా వలసలు ఆగడం లేదు. ఈ పరిణామాలు జగన్ సహా ఆ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి.