ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో వేల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఆపార్టీ నేతలు ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలకు పాల్పడ్డారు. నకిలీ పత్రాలు సృష్టించి, విలువైన భూములను కొట్టేశారు. వారి ఆగడాలు భరించలేక ఎంతో మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. అక్రమార్కుల చెర నుంచి తమ భూములు తమకు దక్కేలా కొత్త ప్రభుత్వం చొరవ చూపాలని బాధితులు కోరుతున్నారు.