YSRCP leaders in Nandivelugu of Guntur District : గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో వైఎస్సార్సీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్త ఇంటి గేటుకు అడ్డంగా గోడ నిర్మించారు. గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబం ఊరెళ్లి వచ్చేసరికి వారి ఇంటి గేటుకు అడ్డంగా రోడ్డుపై గోడ నిర్మించారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ (MPTC) సభ్యుడు షేక్ సిలార్ జానీ బాషా, వైఎస్సార్సీపీ యువజన నేత షేక్ అలీముద్దీన్ కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారని టీడీపీ కార్యకర్త ఆరోపించారు.