YSRCP leaders Irregularities in Jagananna Colony: గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. జగనన్న కాలనీలు పేరుతో జరిగిన దోపిడీలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా స్థల సేకరణలో వైఎస్సార్సీపీ నేతలు చేతివాటం ప్రదర్శించిన వైనం ఆశ్చర్యపరుస్తోంది. వైఎస్సార్సీపీ నాయకులు ఎందుకూ పనికిరాని తమ భూమిల్ని ప్రభుత్వానికి అధిక ధరలకు విక్రయించి, కాలనీలో రెండు మూడు ఇళ్లు కేటాయించుకొని లాభపడ్డారు.