Irregularities in Jagananna Housing Layout in Kadapa District : అధికారం ఉందన్న అండ చూసుకొని గత ఐదేళ్లులో వైఎస్సార్సీపీ నేతలు అక్రమ భూదందాకు పాల్పడ్డారు. అనధికారంగా అక్రమ లేఅవుట్లు వేసి భూదందాకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా 585 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిపై టౌన్ ఫ్లానింగ్ రాష్ట్ర అదనపు డైరెక్టర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.