YSRCP Office at Occupied Sites in Peddapadu: నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో వైఎస్సార్సీపీ కార్యాలయాలు నిర్మించడమే కాదు. కొన్ని చోట్ల ప్రైవేట్ స్థలాలు ఆక్రమించి మరీ కట్టేశారు. శ్రీకాకుళంలో జాతీయ రహదారి పక్కనే విలువైన ఇంటి స్థలం కబ్జా చేసి మరీ నిర్మాణం చేపట్టారు. దీనిపై గత ప్రభుత్వ హయాంలో బాధితులు ఎంత మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వమైనా న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.