Suspended Senior IPS Officer Supporting to YSRCP : ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓడిపోయినా సస్పెన్షన్లో ఉన్న ఓ ఐపీఎస్ అధికారి ఇంకా ఆ పార్టీ సేవలోనే తరిస్తున్నారు. జగన్ పాలన జరిగిన కుంభకోణాలు, అక్రమాల దర్యాప్తునకు ఆటంకం కలిగించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. విచారణ నుంచి ఎలా తప్పించుకోవాలనే దానిపై నిందితులకు సలహాలు ఇస్తున్నారు. దీంతో ఆ ఐపీఎస్ అధికారి తీరు ఇప్పుడు పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.