YSRCP Online Trolling on Women in AP : పాము తన పిల్లల్ని తానే తింటుంది. వైఎస్సార్సీపీ విషనాగులూ అంతే! ఆ పార్టీ అధినేత జగన్ను విమర్శిస్తే చాలు, ఆ పార్టీతో విభేదిస్తే చాలు కాట్లకుక్కల్లా రెచ్చిపోతారు. తల్లి, చెల్లి, అక్క అనే తేడాలుండవు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, అనిత మొదలుకుని చివరకు విజయమ్మైనైనా, షర్మిలనైనా బండబూతులతో తిట్టిపోస్తారు. ఫోటోలు మార్ఫింగ్ చేస్తారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి పైశాచికానందం పొందుతారు. ఇందుకోసం దాదాపు 50 వేల మంది సైకోలతో ఓ నెట్వర్క్ నడుస్తోంది. తాడేపల్లిలో కాస్కో అనగానే, ఉస్కో అంటూ ఉచ్ఛనీచాలు వదిలేసివిషం చిమ్ముతోంది. ఈ ఉన్మాద నెట్వర్క్ను ఛేదించడమే పనిగా పెట్టుకున్న పోలీసులు ఇప్పటికే వందల మందికి నోటీసులిచ్చారు.