Be Careful With Online Contacts In Social Media : సామాజిక మాధ్యమం అరచేతిలో ప్రపంచం. సేవలు విశ్వవ్యాప్తం. వినియోగం ఓ ఆనందం. భావాల వ్యక్తీకరణకు దోహదం. మధురానుభూతుల సంగమం. ఇలా ఒక్కటా రెండా మానవ జీవితంలో సామాజిక మాధ్యమాలది కీలక పాత్ర. కానీ, ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. సోషల్ మీడియా వినియోగం హెచ్చుమీరడంతో అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టా, ఎక్స్ తదితర ఆన్లైన్ వేదికల పరిచయాలు ప్రాణాలనూ హరిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్లో గర్భిణీ హత్యే ఇందుకు ఓ ఉదాహరణ. సోషల్ మీడియా కారణంగా యువతులే ఎక్కువగా మోసపోతున్నారనేది ఒక పరిశీలన. అసలు ఎందుకు ఈ దుస్థితి. సామాజిక పరిచయాలు ప్రాణాంతకంగా ఎందుకు మారుతున్నాయి? ఆన్లైన్ పరిచయాల పట్ల ఎలాంటి అప్రమత్తత అవసరం? నిపుణుల సూచనలు ఏంటి?