Argument between Tehsildar and woman : నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ కోసం వారం రోజులుగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి విసిగి వేసారిన యువతి ఇవాళ అధికారిణితో వాగ్వాదానికి దిగింది. స్టాఫ్ నర్సింగ్ పోస్టుకు దరఖాస్తు చేసేందుకు ఇవాళ చివరి రోజు కావడంతో తండ్రి, కుమారై తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ కోసం హేమావతి అనే యువతి తన తండ్రితో కలిసి తహశీల్దార్ కార్యాలయానికి వచ్చింది. ఐదు రోజులగా తిరుగుతున్నా సర్టిఫికెట్‌పై సంతకం చేయలేదని రోదిస్తూ ఇవాళ తహశీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు.