Huge Fraud in Manappuram Gold Loan in Khammam : ఖమ్మంలో మణప్పురం గోల్డ్ లోన్లో భారీ మోసం వెలుగు చూసింది. ఖాతాదారులు కట్టిన డబ్బును బ్యాంకు ఖాతాలో జమ చేయకుండా సొంత అకౌంట్లోకి తరలించిన ఘటనపై ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న మణప్పురం గోల్డ్ లోన్లో కొందరు ఖాతాదారులు బంగారం కుదవ పెట్టి అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చుకుంటూ వచ్చారు. అప్పు తీరిన ఖాతాదారులు వచ్చి తమ బంగారం ఇవ్వమంటే మీరు అప్పు కట్టలేదని సిబ్బంది చెప్పడంతో అవాక్కయ్యారు. అధికారులను గట్టిగా నిలయదీయడంతో ఖాతాలో జమ చేయలేదని చెబుతున్నారు. దీంతో బాధితులు అందోళన వ్యక్తం చేశారు. తమ బంగారం తమకు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బాధితులు హెచ్చరిస్తున్నారు. తాము కౌంటర్ ఉన్న వ్యక్తికి డబ్బులు ఇచ్చామని బాధితులు అధికారులకు చెప్పారు. ప్రస్తుతానికి సుమారు 5 లక్షల రూపాయల వరకు మోసపోయినట్లు గుర్తించామని, బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.