చదువు మధ్యలోనే ఆపేసిన యువతులు, ఆర్థిక స్తోమత లేని, నిరాశ్రయ మహిళలకు ఉచిత నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా ఆర్థిక భరోసా కల్పించేందుకు ఏర్పాటు చేసినవే మహిళా ప్రగతి ప్రాంగణాలు. వైఎస్సార్సీపీ పాలనలో మహిళా ప్రాంగణాల ప్రగతి నిలిచిపోయింది. కొవిడ్‌ను సాకుగా చూపి నాలుగేళ్లుగా ఎలాంటి శిక్షణా తరగతులు నిర్వహించకపోవడంతో స్వయం ఉపాధి కోసం అతివలు అవస్థలు పడుతున్నారు.