Young Woman Attacked by Unknown Person in Vizianagaram District : విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాం గ్రామంలో యువతిపై దాడి ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువతి శనివారం ఇంటి ముందు దుస్తులు ఉతుకుతుండగా మాస్క్ ధరించిన గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి పరారయ్యాడు. పొట్టలో బలంగా కత్తిపోట్లు దిగడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఆమెను చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయనగరంలోని ఆసుపత్రికి తరలించారు. కత్తితో పొడిచి పరారైన వ్యక్తి కోసం స్థానికులు, పోలీసులు గాలిస్తున్నారు.