Police Arrest Suspect Murdered Disabled Man from Kuwait : అన్నమయ్య జిల్లాలో కలకలం సృష్టించిన దివ్యాంగుడు ఆంజనేయులు (59) హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడైన ఆంజనేయప్రసాద్, ఆయన భార్యాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ కుమార్తె (12) పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆంజనేయులును స్వయంగా తానే హత్య చేసినట్లు నిందితుడు తెలిపారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమ వేదికగా ఆంజనేయప్రసాద్ ప్రకటించారు. తానే పోలీసుల ఎదుట లొంగిపోతున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. అనంతరం నిందితుడిని తమిళనాడులో పట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడే లొంగిపోయాడా? లేక అతడు కువైట్ నుంచి చెన్నై విమానాశ్రయానికి వచ్చినప్పుడు పట్టు కున్నారా? అనే విషయంపై స్పష్టత లేదు. నిందితుడు ఆంజనేయప్రసాద్ అరెస్టును పోలీసులు ఈరోజు(శుక్రవారం) ప్రకటించే అవకాశం ఉంది.