GANJA BATCH ATTACK YOUTH: నేను ఏ తప్పు చేయలేదు. మీ గంజాయి వ్యవహారం గురించి నేను పోలీసులకు చెప్పలేదు. నన్ను వదిలేయండి. కొట్టకండి అంటూ వేడికున్నా ఆ గంజాయి బ్యాచ్ వినలేదు. మద్యం, గంజాయి మత్తులో ముళ్ల కర్రలు తీసుకుని చితకబాదారు. గాయాలు అయ్యేలా గంటల పాటు హింసకు గరిచేశారు. దగ్గర ఉన్న డబ్బూ లాక్కుని, మరికొంత కావాలంటూ బెదించారు. ఆపై కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఎలాగోలా స్నేహితుడికి సమాచారం ఇవ్వడంతో అతను కాపాడి ఆసుపత్రిలో చేర్పించాడు. ఈ దారుణ ఉదంతం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో కలకలం రేపింది.