స్వచ్ఛతా ఉద్యమానికి దిక్సూచిలా నిలుస్తోంది కృష్ణా జిల్లా చల్లపల్లి.! పదేళ్ల క్రితం మొదలైన స్వచ్ఛ సంకల్పం గ్రామ రూపురేఖల్నే మార్చేసింది. బహిరంగ మలవిసర్జన రహితంగా నిలిచింది. రహదారులు బాగుపడ్డాయి. మురికికూపాలుగా ఉన్న ప్రాంతాలు పార్కులుగా మారాయి. డంపింగ్ యార్డు, శ్మశానం సందర్శన స్థలాలుగా తయారయ్యాయి. ప్రజల్లో పరిశుభ్రత పట్ల అవగాహన పెరిగింది. డాక్టర్ దంపతుల ఆలోచనతో మొదలైన మిషన్ స్వచ్ఛ చల్లపల్లి.. ఈ నెల 12తో పదేళ్లు పూర్తిచేసుకోబోతోంది.