Encroachments of Pedda Cheruvu : ఆ ప్రాంతంలో వందల ఎకరాలకు సాగునీరు అందించే పెద్ద చెరువు అది. నిండుకుండలా నీటితో కళకళలాడుతూ ప్రజలకు వరప్రదాయినిగా ఉండేది. కానీ ఆక్రమణ చెరలో చిక్కి కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి దాపురించింది. గత ఐదేళ్లూ వైఎస్సార్సీపీ పెద్దల అండతో కొందరు కబ్జాకాండకు తెరతీశారు. చెరువు గర్భాన్ని ఆక్రమించి సాగు చేపట్టారు. కూటమి అధికారంలోకి వచ్చినా ఇప్పటికీ కబ్జాలపర్వం సాగుతున్నా, అడిగేవారు లేక చెరువు పూర్తిగా కనుమరుగయ్యే దుస్థితి నెలకొంది.