YSRCP Government Careless on Offshore Project: వైఎస్సార్సీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టుల్లో ఆఫ్షోర్ కూడా ఒకటి. శ్రీకాకుళం జిల్లాలో వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు తలపెట్టిన ఈ ప్రాజెక్టుని గత ప్రభుత్వం అటకెక్కించింది. ప్రాజెక్టు వస్తే తలరాతలు మారతాయని ఎదురుచూసిన రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. మరోవైపు పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల్లేక నిర్వాసితులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కూటమి ప్రభుత్వమే ఆఫ్షోర్ బాధ్యతని తీసుకోవాలని రైతులు, నిర్వాసితులు కోరుతున్నారు.