Ministers Visited Weligonda Project: గత ఐదేళ్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం జలయజ్ఞం పేరును ధన యజ్ఞంగా మార్చిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోల బాల వీరాంజనేయ స్వామి పలువురు ఎమ్మెల్యేలతో కలిసి నిమ్మల సందర్శించారు.