SRSP Project Tourism Development: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడంపై ముందడుగు పడింది. ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్ ప్రాంతాన్ని ఏకో టూరిజం హబ్‌గా చేసేందుకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ నడుం బిగించింది. పర్యాటకాభివృద్ధికి అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆలస్యమైనా ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ తీసుకున్న నిర్ణయంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.