Minister Ponnam slams BRS : మూసీ బాధితుల పట్ల హరీశ్‌రావు లాంటి నాయకులు రాజకీయం చేస్తున్నారని మంత్రి పొన్నం ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మల్లన్నసాగర్ నిర్వాసితులను లాఠీలతో అణచివేశారని ఆయన పేర్కొన్నారు. అధికారం లేదని బీఆర్ఎస్ నాయకులు, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ నిర్వాసిత కుటుంబాల జీవితాలతో ప్రతిపక్షాలు అడుకోవద్దని ఆయన స్పష్టం చేశారు