Foreign Experts Report on Polavaram Project: పోలవరం ప్రాజెక్టు సవాళ్లపై అధ్యయనం చేసిన విదేశీ నిపుణుల బృందం కీలక సిఫార్సులు చేసింది. డిజైన్ మార్పులతో కొత్త డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం నిర్మించాలని పేర్కొంది. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల సీపేజిని పూర్తిగా నియంత్రించాలంటే ఖర్చు ఎక్కువవుతుంది కనుక వాటి జోలికి పోకుండా ఆ కాఫర్ డ్యాంలతోనే ముందుకు సాగుదామని పేర్కొంది. పోలవరం ప్రాజెక్టులో నాణ్యత, నియంత్రణ పర్యవేక్షణకు ప్రభుత్వ పరంగా సరైన ఏర్పాట్లు లేవని స్పష్టం చేసింది. ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై త్వరలో ఒక వర్క్‌షాప్ ఏర్పాటు చేయాలని సూచించింది.