International Experts Team Observation of Polavaram Project: పోలవరం ప్రధాన డ్యాం ప్రాంతంలో సీపేజి ఎత్తిపోయాల్సిందేనని అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టంచేసింది. కొంత గ్రావిటీ ద్వారా, మిగిలింది ఎత్తిపోయాలని సూచించింది. దానికి కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపింది. డ్యాంల భద్రత, నిర్మాణం, జియో టెక్నికల్ అంశాల్లో విశేష అనుభవం ఉన్న డేవిడ్ బి.పాల్, రిచర్డ్ డోన్నెల్లీ, గియాస్ ఫ్రాంక్ డి సిస్కో, సీస్ హించ్‌బెర్గర్ అందరూ కలిసి చర్చించుకుని, కొంత అధ్యయనం చేసి తమ ప్రాథమిక నివేదికను అందించారు. డయాఫ్రం వాల్‌పై నిర్ణయాన్ని తుది నివేదికలోనే వెల్లడించనుంది. సీడబ్ల్యూసీ ఛైర్మన్ ఈ నివేదికను రాష్ట్ర జలవనరులశాఖ అధికారులకు పంపి ఎలా ముందుకు వెళ్లనున్నారో, ఆ ప్యానెల్ సూచించిన పరీక్షలను ఎలా చేపడతారో తెలియజేయాలని కోరారు.