Prakasam Barrage Works Updates : ప్రకాశం బ్యారేజ్ గేట్లను పడవలు ఢీకొని దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను ఇంజినీర్లు విజయవంతంగా అమర్చారు. నిపుణుడు కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో ఇంజినీర్లు రేయింబవళ్లు కష్టపడి కేవలం నాలుగు రోజుల్లోనే మరమ్మతులు పూర్తి చేశారు. ట్రయల్ రన్ చేసి గేట్లు ఆపరేట్ చేశారు. ఈ సందర్భంగా కన్నయ్యనాయుడుతోపాటు ఇంజినీర్లు, అధికారులను కూటమి నేతలు సన్మానించారు. ప్రస్తుతం కౌంటర్ వెయిట్లను కాంక్రీట్‌తో నింపే పనులు, పడవలను బయటికి తిసే పనులు వేగవంతం చేశారు.