Prakasam Barrage Gates Repair Works : ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తిచేయాలని సంకల్పించిన ప్రభుత్వం పనుల్ని వేగంగా చేస్తోంది. ఏడు రోజుల్లో పనులన్నింటినీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ రెండు రోజుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసేలా అనుభవజ్ఞులైన ఇంజినీర్లు, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పడవలు ఢీ కొట్టడంతో ధ్వంసమైన కౌంటర్ వెయిట్ల తొలగింపు ఇప్పటికే పూర్తికాగా ఇవాళ అధునాతన రీతిలో తయారు చేసిన కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేయనున్నారు.